మొన్న వచ్చింది.. అప్పుడే స్టార్ హీరో ఫ్యామిలిని గడగడలాడిస్తోందిగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాల నుంచి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఓ పెద్ద కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైందని ఫిలిమ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.తన తాతల నుంచి ఇండస్ట్రీలో సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టి,ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆ కుటుంబంలోకి కొత్తగా అడుగుపెట్టిన కోడలు ఆ వ్యవహారాలన్నీ చక్కదిద్దడం కోసం ఆ బరువు బాధ్యతలను తన చేతిలోకి తీసుకుందని తెలుస్తోంది.

కేవలం సినిమా వ్యవహారాలు మాత్రమే కాకుండా ఇతర వ్యాపార రంగాలలో కూడా ఆమె చురుకుగా ఉంటూ బాధ్యతలను తన చేతిలోకి తీసుకుంది.అదేవిధంగా ప్రస్తుతం ఆ కుటుంబంలోని వ్యక్తులు సినిమా నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న క్రమంలో ఆ నిర్మాణ బాధ్యతలను కూడా తన మనిషి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఆ కుటుంబంలో ఇటువంటి బాధ్యతలను ఇప్పటివరకు ఆ కుటుంబ పెద్ద మాత్రమే వ్యవహరించేవారు. అయితే కొత్తగా ఇంట్లోకి అడుగుపెట్టిన కోడలు ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.ఏదిఏమైనా ఇన్నిరోజులు ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు గొడవలు లేకుండా చక్కగా ఉన్న కుటుంబంలోకి కోడలు అడుగుపెట్టగానే ఆధిపత్యపోరు మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో.. లేదో ..తెలియాల్సి ఉంది.