జేబులో నుంచి పొగలు.. ఏంటి అని చూస్తే షాకింగ్ వీడియో?

చాలా సందర్భాలలో మొబైల్ ఫోన్లు బ్యాటరీ సమస్యతో కాలిపోతూ ఉంటాయి.ఎక్కువగా ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ ఉబ్బి పేలిపోతుంటాయి. అయితే ఇలా మొబైల్ పేలిన సంఘటనలు ఇప్పటికే ఎలా జరిగాయి. కానీ ప్రజలు మాత్రం మొబైల్ పట్ల అప్రమత్తంగానే ఉంటున్నారు. తాజాగా గుజరాత్లోని పటాన్ జిల్లాలో రాదాన్పుర్ లో ఒక వ్యక్తి జేబులో నుంచి ఉన్నఫలంగా మంటలు చెలరేగాయి. వెంటనే అతని జేబులో ఉన్న ఫోన్ తీసి నేలపై పడేసాడు. అతను చూస్తుండగానే కొన్ని క్షణాల్లోనే మొబైల్ మంటల్లో కాలి బూడిద అయింది. అయితే అతను ముందుగానే గమనించి మొబైల్ తీసి పక్కకు పారేయడం వల్ల అతను బయట పడ్డాడు.

ఈ ఘటన వల్ల అతని షర్టు కొద్ది భాగం కాలింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి ఘటనే స్కాట్లాండ్ లో ఒకటీ చోటు చేసుకుంది. ఒక వ్యక్తి పాత ఫోను చేసి కొత్తది కొనుక్కో గా అది కొన్ని రోజులకు వేడెక్కడం మొదలుపెట్టింది. ఇలా ఒక రోజు అతను ఏదో పనిలో ఉంటూ మొబైల్ చేతిలో పట్టుకుని ఉన్నాడు. అప్పుడు సడన్గా చేయి కాలినట్లు అనిపించడంతో ఏంటా అని చూస్తే మొబైల్ కాలిపోతుంది. దీంతో వెంటనే నేలపైకి విసిరేయగానే అది పేలిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం చేసి ఉంటే అతనికి కూడా తీవ్ర గాయాలు అయ్యేవి.