ఏంటీ..మ‌హేష్‌కు ఇప్ప‌టికీ అది రాదా? ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్లు!

నటశేఖరుడు కృష్ణ‌ వారసుడిగా ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. `రాజకుమారుడు` సినిమాతో హీరో అయ్యాడు. ఆ త‌ర్వాత హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ఒక్కో సినిమా చేస్తూ.. టాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో ఒక‌రిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. త‌న‌దైన అందం, అభినయం, న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే మ‌హేష్‌..ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటాడు.

అందుకే ఆయ‌నంటే.. సామాన్యులే కాదు సెల‌బ్రెటీలు కూడా ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక ఇప్పటి వ‌ర‌కు హీరోగా 26 సినిమాలను కంప్లీట్ చేసిన మహేష్ ఏడు రాష్ట్ర నంది అవార్డులు, ఐదు ఫిలింఫేర్, మూడు సైమా అవార్డులను అందుకున్నాడు. అటువంటి ఈయ‌న‌కు తెలుగు చ‌ద‌వ‌డం రాదు అంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు.

అవును, మ‌హేష్‌కి ఇప్ప‌టికీ తెలుగు చ‌దవ‌డం రాదు. ఆయ‌న తెలుగు స్పష్టంగా మాట్లాడగలడు, కానీ చదవలేడు. మ‌హేష్‌ చెన్నైలో పుట్టి పెరిగాడు. దీంతో తెలుగు భాష నేర్చుకోవడానికి అవకాశం లేదు. ఇక ద‌ర్శ‌కులు చెప్పిన డైలాగ్స్ విని సినిమాలో చెబుతుంటారు త‌ప్పా.. పేప‌ర్ల‌పై రాసిన వాటిని చ‌ద‌వ‌లేడు. అయితేనేం.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నం.వ‌న్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచాడు మ‌హేష్‌.