మహేష్ పుట్టిన రోజున.. ప్రముఖ గెస్ట్ ఇతనే..

ఇండస్ట్రీలో హీరోల బర్తడే అంటే తన అభిమానులు పండగ చేసుకునే విషయంలో అస్సలు రాజీ పడరు.ఇక అదే రోజున తమ హీరో లకు సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్స్, ట్రైలర్ వంటి విడుదల కావడంతో చాలా సంబరపడిపోతూ ఉంటారు ఫ్యాన్స్. అయితే రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావున సర్కార్ వారి పాట సినిమా నుంచి ఒక సర్ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తున్నది.

ఇక అంతే కాకుండా ఈరోజు 12:00 నుంచి మోస్ట్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సర్కారు వారి పాట ప్రత్యేకంగా పోస్టర్ ను ఆవిష్కరించనున్నారు. అయితే త్వరలో త్రివిక్రమ్ తో సినిమా కూడా చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇక అదే రోజున త్రివిక్రమ్ తో కూడా ఏదైనా అప్డేట్ వస్తుంది అని ఆనందంతో మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇక త్రివిక్రమ్ సినిమా తో పూర్తి అయిన వెంటనే, ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో కూడా సినిమా ఉంటుందా..? లేదా? అనే సందేహంలో ఉన్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. కానీ వీటిపై తమ ఫ్యాన్స్.. రాజమౌళి ఈ విషయం మహేష్ భర్త డే రోజున తెలియజేస్తే బాగుంటుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలియజేస్తున్నారు.

ఒకవేళ రాజమౌళి మూవీ అనౌన్స్ చేశాడు అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీ సంబంధించినది అవుతుందని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు ఇదివరకే చెప్పుకొచ్చాడు. అయితే దర్శకధీరుడు తో మాత్రం ప్రకటన వెలువడితే అభిమానులకు ఉండే కిక్కే వేరు అని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నది ఈ విషయం.