మహేష్ బాబు నటించిన టాప్ టెన్ మూవీస్…

మహేష్ బాబు అతిథిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. నటుడిగా తాను ఎన్నో సంవత్సరాల నుంచి రాణిస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా ఇంత వయసు వచ్చినా కూడా తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు మహేష్ బాబు. అయితే ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఆయన నటించిన టాప్ టెన్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం.

1). పోరాటం:
మహేష్ బాబు ఈ సినిమాలో తన తండ్రి తో మొదటి సారిగా కలిసి నటించాడు . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

2) శంఖారావం:
మహేష్ బాబు తన తండ్రి రెండోసారి కలిసి నటించిన చిత్రం శంఖారావం. ఈ సినిమాకి స్వయంగా దర్శకత్వం కృష్ణ గారే వహించారు. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

3). ముగ్గురు కొడుకులు:
మహేష్ బాబు నాలుగో సారి తన తండ్రితో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు వాళ్ళ సోదరుడు రమేష్ బాబు కూడా నటించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను మిగిల్చింది.

4). గూడచారి-117:
ఇక మరో సారి తండ్రి కొడుకులు కలిసి గూడచారి-117 సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది.

5). రాజకుమారుడు:
హీరో మహేష్ బాబు నటించిన మొట్టమొదటి చిత్రం హీరోగా రాజకుమారుడు. ఈ సినిమాతో మొదటి సక్సెస్ అందుకున్నాడు.

6). మురారి:
మహేష్ బాబుకి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చినది మురారి సినిమా.

7). ఒక్కడు:
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒక్కడు.ఈ సినిమా మహేష్ కెరీర్లోనే అత్యధిక హిట్ గా నిలిచిపోయింది.

8). అతడు:
శ్రీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం అతడు. ఈ సినిమాలో మహేష్ ఒక కొత్త నటుడిగా పరిచయం అయ్యాడు.

9). పోకిరి:
అప్పటి వరకూ ఉన్న రికార్డులను సైతం తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచాడు మహేష్ బాబు ఈ సినిమాతో.

ఇక అంతే కాకుండా దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి ,సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలతో నెంబర్ వన్ హీరో గా నిలిచాడు.