విషాదం: భ‌ర్త‌ను భ‌య‌పెట్టాల‌నుకుంది..చివ‌ర‌కు లోకాన్నే విడిచింది..?

క‌ర్నూలు జిల్లాలో ఓ విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. భ‌ర్త‌ను భ‌య‌పెట్టాల‌నుకున్న భార్య‌.. చివ‌ర‌కు ఈ లోకాన్నే విడిచిపెట్టి కుటుంబ స‌భ్యుల‌కు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కొలిమిగుండ్ల మండలంలోని టెలుం బెలుం శింగవరానికి చెందిన రఘుకు, నేలంపాడుకు చెందిన శివమ్మకు ప‌దేళ్ల కింద‌ట వివాహం జ‌రిగింది.

- Advertisement -

Doc husband, Dr wife in bitter fight over sex

ఈ దంప‌తుల‌కు ఏడు నెల‌ల క్రితం ఓ అమ్మాయి జ‌న్మించింది. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి ర‌ఘుకు, శివ‌మ్మ‌కు మ‌ధ్య గొడ‌వులు జ‌రుగుతున్నాయి. గురువారం కూడా మ‌ళ్లీ వీరిద్ద‌రూ ఏదో కార‌ణం చేత గొడ‌వ‌ప‌డ్డారు. దాంతో భ‌ర్త‌ను భ‌య‌పెట్టాల‌నే ఉద్ధేశంతో.. శివ‌మ్మ ఐర‌న్ ట్యాబ్లెట్స్‌ను మింగేసింది.

5 common but deadly drugs | MDLinx

ఇది గ‌మ‌నించిన కుటుంబ‌స‌భ్యులు వెంట‌నే శివ‌మ్మ‌ను హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. కానీ, అప్ప‌టికే ప‌రిస్థితి విష‌మించి.. శివ‌మ్మ ప్రాణాలు విడిచింది. ఈమె మృతితో కుటుంబ‌స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. మ‌రోవైపు విష‌యం తెలుచుకున్న పోలీసులు.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Share post:

Popular