ట్రెండి లుక్ లో వంటలక్క.. ఇలా ఎప్పుడైనా చూశారా?

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయంత్రం అయింది అంటే చాలు ఈ సీరియల్ కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోనీ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి మరి ఈ సీరియల్ ను చూస్తారు అంటే ఈ సీరియల్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందిన మీరు అర్థం చేసుకోవచ్చు.కార్తీకదీపం సీరియల్ దాదాపు గత మూడు సంవత్సరాలుగా అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ టాప్ రేటింగ్ ఉన్న సీరియల్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సీరియల్ లో మలయాళీ బుల్లితెర నటి ప్రేమి విశ్వనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈమె ఈ సీరియల్ లో దీప అలియాస్ వంటలక్క పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. అయితే ఈ సీరియల్ లో ఎప్పుడు ఏడుస్తూ కనిపించే వంటలక్క తాజాగా ఒక ట్రెండీ లుక్ తో కనిపిస్తూ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఫోటోలు షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో కాకా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడు పద్ధతిగా చీరలో కనిపించే వంటలక్క ట్రెండింగ్ లుక్ లో కనిపించేసరికి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Share post:

Popular