కంగనా రనౌత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..?

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది కంగనారనౌత్. అయితే ఈ ముద్దుగుమ్మ అవతల ఎంతటి ప్రముఖులైన సరే తను అనుకున్నది కచ్చితంగా తన మాటల్లో చెప్పేస్తుంది. అందుచేతనే ఈమె ఎప్పుడు విమర్శకుల పాలు అవుతూ ఉంటుంది. ఇక జాతీయ అవార్డు స్థాయి నటి కంగనా ఎన్నో సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను అబ్బుర పరిచింది.

ఇక ఈ మధ్య కాలంలో కంగనారనౌత్ స్కిన్ షోను అడ్డూ అదుపు లేకుండా ప్రదర్శిస్తోంది. 2 వారాల క్రితం ఒక ఫోటోను షేర్ చేసి తన అభిమానులను ,నెటిజన్లను ఆశ్చర్య పరిచేలా చేసింది. ఈ ఫోటో చూసిన వారంతా కంగనా ఇంత గ్లామర్ గా ఉందని ఊహించలేదు అని ఆశ్చర్యపోతున్నారు..అలాగే కామెంట్ కూడా చేస్తున్నారు.Never expected such a skin show from the Fire brand

ఇక రాబోయే రోజుల్లో కంగనా రనౌత్ ఇంకా ఎంత హాట్ గా ఫోజులు ఇస్తుందో అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక అంతేకాదు సినిమాల్లో అందాల విందులు చేస్తూ, సక్సెస్ ను దక్కించుకోవాలని అనుకుంటున్నట్లు మరి కొంతమంది అభిమానులు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఆమె ఏమీ పట్టించుకోకుండా తనదైన శైలిలో ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంది ఈ భామ.Hotness Alert!': Kangana Ranaut impresses fans with her BOLD look from  'Dhaakad' wrap party

ఈమె సినిమాల విషయానికొస్తే , తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తోంది.ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక మరొకవైపు హిందీలో రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికైనా ఈమె వివాదాల నుంచి దూరం గా ఉంటుందేమో వేచిచూడాల్సిందే.