సూప‌ర్ థ్రిల్లింగ్‌గా సునీల్ `కనబడుటలేదు` ట్రైల‌ర్‌!

సునీల్‌ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన తాజా చిత్రం `క‌న‌బ‌డుటలేదు`. ఎమ్ బాలరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో సతీష్, దిలీప్, శ్రీనివాస్, దేవీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ఆగస్టు 13న థ‌యేట‌ర్‌లో విడుల‌ద‌ల కానుంది.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రెండు నిమిషాల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో ఆధ్యంతం సూప‌ర్ థ్రిల్లింగ్‌గా కొన‌సాగింది. ఆదిత్య అనే అబ్బాయి శిశిత అనే అమ్మాయిని ప్రేమిస్తే.. ఆ అమ్మాయి మాత్రం సూర్య అనే మరో అబ్బాయితో ప్రేమలో పడుతుంది. సూర్య‌, శిశిత ప్రేమ వ్య‌వ‌హారం ఇంట్లో తెలియ‌డంతో.. వీరిద్ద‌రూ పారిపోదామ‌ని అనుకుంటారు.

కానీ, అప్ప‌టి నుంచే సూర్య క‌నిపించ‌డు. చివ‌ర‌కు సూర్య మిస్సింగ్ కేసు మిస్టరీ కేసుగా మారుతుంది. అయితే ఈ మిస్ట‌రీ కేసును చేధించడానికి డిటెక్టివ్ రామ‌కృష్ణ(సునీల్‌) రంగంలోకి దిగుతాడు. మ‌రి సునీల్ ఆ కేసును చేదించాడా..? లేడా..? అస‌లు సూర్య ఏం అయ్యాడు..? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Share post:

Latest