జాతి రత్నాలు బామ్మ డిఫరెంట్ గెటప్స్.. అందుకోసమేనా?

న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం జాతి ర‌త్నాలు సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. యూట్యూబర్‌గా ఫ‌రియాకు మంచి గుర్తింపు ఉంది. ఇక జాతి ర‌త్నాలు మూవీలోని చిట్టీ పాట ద్వారా ఫరియా మరింత ఫేమ్‌ని సంపాదించుకుంది. అందులో క్యూట్ లుక్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.మొదటి సినిమాతోనే భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. అయితే ఈమె ఆరేళ్ల వయసులోనే యాక్టర్ కావాలని అనుకుందట. అందుకే డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ డ్రెస్సులు ట్రై చేస్తూ ఉంటాను అని చెప్పింది.

ఫరియా అబ్దుల్లా కి కీర్తి సురేష్, పి.వి.సింధు, సమంత, సైనా నెహ్వాల్ ఇలాంటి సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసిందట. అంతేకాకుండా ఈమె హైదరాబాదులో గీతిక కానుమిల్లి అనే ఒక బొటిక్ ను తన పేరుమీద ప్రారంభించిందట. అలాగే ఇక్కడ ఏది కొనాలన్నా వేలు నుంచి లక్షలు ఖర్చు చేయాలట. ఇది క్వాలిటీ కి పెట్టింది పేరు. ఇక్కడ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఫేవరెట్ అని చెప్పవచ్చు. ఇక్కడ లభించే దుస్తులు, అలాగే జ్యువెలరీ ప్రతి ఒక్కటి కూడా వాట్సాప్ ద్వారా ఆర్డర్ కూడా చేయవచ్చు.

Share post:

Popular