ఆక‌ట్టుకుంటున్న ష‌క‌ల‌క శంక‌ర్ `కార్పోరేట‌ర్‌` ట్రైల‌ర్‌!

ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అయిన క‌మెడియ‌న్ ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌స్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈయన నుంచి ఐదారు సినిమాలు వచ్చాయి. కానీ, ఈ చిత్రాలేమి శంక‌ర్‌కు స‌క్సెస్‌ను తెచ్చిపెట్ట‌లేదు. అయినా కూడా హీరోగా షకలక శంకర్‌కు అవకాశాలు మాత్రం ఆగడం లేదు. ఈయ‌న తాజా చిత్రం `కార్పోరేట‌ర్‌`.

సంజయ్ పూనూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరిలు ఈ చిత్రంలో శంక‌ర్‌కు జోడీగా న‌టించారు. ఎ.పద్మనాభరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

రాజ‌కీయాల నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా వినోదంతో పాటు ఏదో సందేశం కూడా అందించ‌బోతున్నార‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. అలాగే ఈ సినిమా కోసం శంక‌ర్ బాగా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని ట్రైల‌ర్ చూస్తేనే తెలుస్తోంది. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ ట్రైల‌ర్‌కు యూట్యూబ్‌లో మంచి స్పంద‌న వ‌స్తోంది. ప‌లువురు నెటిజ‌న్లు ట్రైల‌ర్ అదిరిపోయింది, సూప‌ర‌ని కామెంట్లు పెడుతున్నాయి. మ‌రి ఆ ట్రైల‌ర్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

Share post:

Popular