ఆగ‌స్టు మొత్తం ప్ర‌పంచానికి ఇండియానే రారాజు..తెలుసా?

ఈ ఆగ‌స్టు నెల మొత్తం ప్ర‌పంచానికి ఇండియానే రారాజు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఐక్యరాజ్యసమితి మొత్తం మీద అత్యంత శక్తివంతమైన విభాగం భద్రతా మండలి. ఈ విభాగంలోని శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు నెలకు ఒక దేశం చొప్పున ఈ మండలికి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తాయి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం.

అయితే స‌భ్య‌దేశంగా కొన‌సాగుతున్న ఇండియాల‌కు ఇప్పుడు ఆ మండ‌లి అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ మేరకు అధ్యక్ష బాధ్యతలను భారత ప్రతినిధి తిరుమూర్తి స్వీకరించారు. ఈ ప‌ద‌విలో భార‌త్ నెల‌రోజుల‌పాటు కొన‌సాగుతుంది. జులై నెలలో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది.

సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, ఉగ్రవాద కట్టడిపై దృష్టి సారిస్తామని భారత ప్రతినిధి తిరుమూర్తి తెలిపారు. ఆయా అంశాలపై ఈ నెలలోనే సంతకాల సేకరణ చేపడుతామని ప్రకటించారు. కాగా, వచ్చే ఏడాది డిసెంబర్‌లోనూ భారత్‌ మరోమారు అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది.

Share post:

Latest