ఇలియానా మనసు మార్చుకుందా.. అందుకే ఈ నిర్ణయం…?

సిని ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్ లు ఇండస్ట్రీకి వస్తే హీరోయిన్ గా  వస్తాను, అలాగే హీరోయిన్ గా నటిస్తూనే తప్పా వేరే పాత్రలు చేయను, అలాగే ఐటమ్ సాంగ్ లో కూడా చేయను అంటూ భీష్మించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే మన టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా కూడా మళ్లీ సినిమాల్లో అడుగు పెడితే హీరోయిన్ గానే అంటూ భీష్మించుకుని కూర్చుంది. అంథాదూన్ రీమేక్ విషయంలో కూడా ఇలియానా అందుకే నో అని చెప్పింది. అప్పుడు నో చెప్పిన ఇలియానా ఇప్పుడు ఏకంగా ఐటమ్ సాంగ్ కు రెడీ అయిపోయింది అంటూ వార్తలు ఇస్తున్నాయి.

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ అలాగే శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఇలియానా ని అడుగుతున్నారంటు, అందుకు ఆమె కూడా అనుకూలంగానే ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇలియానా కూడా మనసు మార్చుకుని ఐటమ్ సాంగ్ లు చేయడానికి రెడీ అయినట్లేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఈ విషయంలో ఉదాహరణగా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకుంటే ఈమె పాత్ర, సాంగ్ ఇలా ఏదైనా కూడా తన దగ్గరికి వచ్చింది అంటే చాలు ఆ అవకాశాలను ఉపయోగించుకుంట దూసుకుపోతోంది.

Share post:

Popular