నిజజీవితంలో జరిగేవే సినిమాలు తీస్తాం అంటూ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ఎస్ దర్శన్  దర్శకత్వం లో సుధీర్ బాబు హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈసినిమాను రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, అలాగే హరీష్ కోయల గుండ్ల నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ఎస్ దర్శన్ మాట్లాడుతూ మా నాన్నగారు కేశం తమిళంలో కొన్ని సినిమాలకు, అలాగే తెలుగులో యమగోల మళ్ళీ మొదలైంది సినిమాలకు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి గారి దర్శకత్వ శాఖలో పని చేశారు అని తెలిపారు.

అలాగే శ్రీనివాస్ రెడ్డి గారి డమరుకం కు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు అంటూ తెలిపారు దర్శన్. అలాగే త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోయే ఇచ్చట వాహనము నిలుపరాదు సినిమా విషయానికి వస్తే విషయానికి వస్తే ఒక పదేళ్ల క్రితం నాకు అలాగే నా స్నేహితుడికి మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశాను అంటూ దర్శన్ చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా ఒక రోజులో జరిగే కథ. నో పార్కింగ్ ప్లేస్ లో బండి పార్క్ చేయడం వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్నదే ఈ సినిమాలో అసలు కథ అంటూ తెలిపారు దర్శన్.

Share post:

Latest