హార్ధిక్ పాండ్యా ధ‌రించిన ఆ వాచ్‌ రేటెంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!

టీమిండియా ఆల్‌రౌండర్‌, ముంబై ఇండియన్స్ ప్లేయర్ హార్ధిక్ పాండ్యా క్రికెట్‌లోనే కాదు సోష‌ల్ మీడియాలోనూ ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం విదేశాల్లో వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్న హార్ధిక్‌.. తాజాగా కొన్ని ఫొటోల‌ను షేర్ చేశాడు.

 ఆశ్చర్యకరమైన అప్‌డేట్ ఏంటంటే... అతని చేతికి ఉన్న వాచీ మామూలుది కాదు. ఇప్పుడు దాని గురించే ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అంతలా చెప్పుకోవడానికి ఆ వాచీకి ఉన్న ప్రత్యేకతేంటి? (image credit - instagram - hardikpandya93)

అయితే తాజా ఫొటోల్లో హార్ధిక్ చేతికి ఉన్న వాచ్ ధ‌ర ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు ఇంత‌కీ ఆ వాచ్ స్పెషాలిటీ ఏంటీ..? దాని రేటెంత..? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాటినంతో త‌యారు చేసిన ఆ వాచీ డ‌య‌ల్ చుట్టూ.. 32 బగుట్టే కట్ పచ్చ (మరకతం) రాళ్లను ఎటాచ్ చేశారు. అలాగే దీని డయల్‌లో డార్క్ గ్రే ఉంది.

 ఈ వాచీ డయల్ చుట్టూ 32 బగుట్టే కట్ పచ్చ (emerald - మరకతం) రాళ్లను సెట్ చేశారు. వాచ్ మొత్తం ప్లాటినం (platinum)తో తయారైంది. దీని ధర రూ.5 కోట్లు అంటే నమ్మగలరా. (image credit - instagram - hardikpandya93)

అందుకే ఈ పతేక్ ఫిలిప్పే నాటిలస్ ప్లాటినం 5711 వాచీలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన వాచీల‌ట‌. ఇక దీని ధ‌ర అక్ష‌రాల రూ. 5 కోట్లు. ఇటువంటి వ‌చీలు చాలా త‌క్కువ మంది ద‌గ్గ‌ర ఉన్నాయి. వారిలో హార్ధిక్ ఒక‌డు. ఇక ఇదే కాకుండా హార్ధిక్ ద‌గ్గ‌ర మ‌రిన్ని ఖ‌రీదైన వాచీలు కూడా ఉన్నాయి.

Share post:

Latest