ఆరో పెళ్లికి సిద్ధ‌మైన మాజీ మంత్రి..దిమ్మ‌తిరిగే షాకిచ్చిన మూడో భార్య‌!

ఒక పెళ్లి చేసుకున్న వారే నానా ఇబ్బందులు ప‌డుతుంటే.. ఓ మాజీ మంత్రి ఐదు పెళ్లిళ్లు చేసుకోవ‌డ‌మే కాదు ఆరో పెళ్లికి కూడా సిద్ధ‌మ‌య్యాడు. కానీ, ఇంత‌లోనే అత‌డి మూడో భార్య దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఉత్తర్‌ప్రదేశ్‌లోసమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి చౌదరి బషీర్‌ ఆరోసారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు.

అయితే ఈ విష‌యం తెలుసుకుని అత‌డి మూడో భార్య న‌గ్మా.. బ‌షీర్‌పై పోలీసు కేసు పెట్టింది. 2012లో బ‌షీర్‌కు, త‌న‌కు వివాహం అయింద‌ని.. అప్ప‌టినుంచి త‌న‌ను వేధిస్తూనే ఉన్నాడ‌ని న‌గ్మా పిర్యాదులో పేర్కొంది. అయితే బ‌షీర్ ఆరో పెళ్లి చేసుకుంటున్న‌ట్లు ఇటీవ‌లె త‌న‌కు తెలిసింద‌ని.. దాంతో తమ మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రిగేవ‌ని చెప్పుకొచ్చింది.

ఇక ఈ నేప‌థ్యంలోనే బ‌షీర్ ట్రిపుల్‌ తలాక్‌ రూపంలో విడాకులు ఇచ్చి ఇంట్లోంచి బయటకు పంపించారని న‌గ్మా తెలిపింది. న‌గ్మా పిర్యాదుతో కేసులు న‌మోదు చేసుకున్న పోలీసులు.. బ‌షీర్ ఆరో వివాహం ఆప‌డంతో పాటుగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Share post:

Popular