హార్లీ డేవిడ్సన్‌పై ‘బిగ్ బాస్’ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

‘లెట్స్ గో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి దివి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమెను నెటిజన్లు ‘సోషల్ మీడియా క్వీన్’గా అభివర్ణిస్తుంటారు. ‘బిగ్ బాస్ సీజన్-4’ కంటెంస్టెంట్‌గా ఎంపికైన ఈ భామ సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తుంటంది. తాజాగా ఈ బిగ్ బాస్ బ్యూటీ గ్లామరస్ లుక్ ఉన్న సాహసపోతమైన ఫొటోలను షేర్ చేసింది.

హార్లీ డేవిడ్ సన్ బైక్‌పై సాహసాలకు సిద్ధమైన ఫొటోలు అవి కాగా, వాటిని చూసి నెటిజన్లు ‘బ్యూటిఫుల్ హీరోయిన్, ఇండస్ట్రీలోఇక చాన్సెస్ అన్ని ఈమెనే వరించునుగాక’ అని కామెంట్స్ చేస్తున్నారు. డెనిమ్ షార్ట్ ధరించి బైక్ పై ఉన్న దివిని చూస్తే యూత్ ఇట్టే పడిపోతారని చెప్పొచ్చు. ఫొటోలో టాప్ టు బాటమ్ హాటెస్ట్ లుక్‌ ఎలివేట్ అవుతోంది. ఈ ఫొటోను ఇన్ స్టా వేదికగా దివి షేర్ చేయగా అది చూసి ఆమె ఫాలోవర్స్ ఆమెను తెగ పొగిడేస్తున్నారు.‘లెట్స్ గో’ చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే ఫ్రెండ్ పాత్రను పోషించి గుర్తింపు తెచ్చుకుంది.