తన సినిమాకు తానే డైలాగులు రాసుకుంటున్న హీరో.. ఎవరంటే?

హీరో ధనుష్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తుల్లువదో ఇలమై అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ధనుష్. మొదట ఆయన లుక్స్, పర్సనాలిటీ చూసి ఇతడేం హీరోరా బాబూ అంటూ హేళన చేసినవారి నోర్లు మూయించే విధంగా ప్రస్తుతం ధనుష్ తమిళ స్టార్ హీరోగా వెలుగుతున్నాడు. హీరోగా ఎదగాలి అంటే పర్సనాలిటీ కలర్ కి ముఖ్యం కాదు, కష్టపడటం ముఖ్యం అని నిరూపించిన హీరో ధనుష్. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఒక వెలుగు వెలుగుతున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ధనుష్ ముగ్గురు భామలతో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం తిరుచ్చిట్రబులం తాజాగా పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకుని షూటింగ్ మొదలు పెట్టింది.సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు జవహర్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి నటుడు ధనుష్, కథనం అలాగే సంభాషణలు అందించడం విశేషం. ధనుష్ జంటగా హీరోయిన్ రాశికన్నా, అలాగే నిత్యా మీనన్, ప్రియా భవాని శంకర్ నటిస్తున్నారు. అలాగే భారతీరాజా, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.