సుధీర్ పై దారుణంగా కామెంట్స్ చేసిన దీపిక.. ఏం జరిగిందంటే?

సుడిగాలి సుదీర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో లో తనదైన శైలిలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఎంతోమంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కమెడియన్ గా, మెజీషియన్ గా, హీరోగా ఇలా అన్ని రంగాల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. అలాగే ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో యాంకర్ గా కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఢీ షో కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. అయితే ఈ షో లో సుధీర్ ని దీపిక అవమానించినట్టు గా మాట్లాడింది.

- Advertisement -

 

తాజాగా రిలీజైన ప్రోమో లో హైపర్ ఆది అలాగే సుధీర్ ఇద్దరూ పల్లెటూరి పెదరాయుడు గెటప్ లో ఎంత ఇస్తారు. అప్పుడు ఆ ఊరికి కొత్తగా వచ్చాము అంటూ యాంకర్ ప్రదీప్ అలాగే తనతో పాటు శర్వరీ కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇంతలో రష్మీ అలాగే దీపిక పిల్లి కూడా పల్లెటూరి అమ్మాయి లాగ ఎంట్రీ ఇస్తారు. అప్పుడు ప్రదీప్ ఈ ఊరికి మేము కొత్తగా వచ్చాము, మాకు ఇల్లు కావాలి అని అడగగా అప్పుడు దీపికా పిల్లి మా ఇంటికి వస్తారా అని అడుగుతుంది. వెంటనే స్పందించిన సుధీర్ ఎప్పుడైనా నన్ను ఇంటికి వస్తారా అని అడిగావా అని అడగగా మీరు అడగకపోయినా వస్తారని దీపిక కామెంట్ చేస్తుంది. అందుకు రష్మీ వెంటనే అయ్యా అని అంటుంది.

Share post:

Popular