నాని సినిమాకు ముహూర్తం ఫిక్స్.. థియేటర్లో కాదట!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నామని నాని ఆశపడగా, ఆయన ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. ఇక ఈ సినిమా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ పలుమార్లు చెప్పుకొచ్చినా, ఇప్పుడది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

అయితే ఈ సినిమా డిజిటిల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారట. అయితే ఈ సినిమాను ఎప్పుడు స్ట్రీమింగ్ చేయాలా అనే విషయంపై తాజాగా ఓ క్లారిటీకి వచ్చారట. సెప్టెంబర్ నెలలో వినాయక చవితి సందర్భంగా పలు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతుండగా, టక్ జగదీష్‌ను అమెజాన్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట.

సెప్టెంబర్ 10న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి తీసుకురావాలని చిత్ర యూనిట్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ భావిస్తోందట. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి టక్ జగదీష్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

Share post:

Latest