దేశంలో మ‌ళ్లీ 30 వేల‌కు పైగా క‌రోనా కేసులు..648 మంది మృతి!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి.

అయితే నిన్న మాత్రం రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 37,593 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,12,366 కు చేరుకుంది. అలాగే నిన్న 648 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,35,758 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 34,169 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,17,54,281 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 3,22,327 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్న దేశ‌వ్యాప్తంగా 17,92,755 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.