ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళ పరిశ్రమలో చెందిన ప్రముఖ నటి నల్లైనై (56) ఏమి శనివారం తన నివాసంలో కన్నుమూసింది. ఇక ఈమెకు వయసు ఎక్కువ కావడం చేత గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.
శనివారం సాయంత్రం నటి చిత్ర అంతక్రియలు నిర్వహించనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇక ఈమె సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే బాలనటిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది ఈమే. ఇక 1980-1990 సంవత్సరంలో తెలుగు,తమిళంతో పాటు, కన్నడ సినిమాల్లో కూడా నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నది. పరంపర, కలిక్కలం, రాజవచ్చా వంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించింది.
ఇక ఈమె సినిమాల్లోనే కాకుండా కొన్ని సీరియల్స్ లో కూడా నటించి తన అభిమానులను ఎంతగానో సంపాదించింది. ఇక నటి చిత్రకు భర్త, ఒక కూతురు ఉన్నట్లు సమాచారం. ఇక ఈమె మృతిచెందడంతో తమిళ ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు. ఏదిఏమైనా ఈ సంవత్సరంలో దాదాపుగా ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోవాల్సి వచ్చింది.
ఒక వైపు కరోనా తో సినీ ప్రముఖులు మృతి చెందుతున్నారు. మరోవైపు అనారోగ్య సమస్యలతో మరికొంత మంది మృతి చెందుతున్నారు. ఇక ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ రాబోతున్న డంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటిస్తూ ఉంటే, ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉంటారు.