చిరంజీవి నటించిన హిట్లర్ మూవీ కి మొదట ఎవరిని అనుకున్నారో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ మూవీ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఈ సినిమా అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించడం తోపాటు, సమాజంలో ఎలా ఉండాలి ఆడపిల్లలు ..అనే దానిని బాగా వివరించారు.

హిట్లర్ సినిమా చిరంజీవి కెరీర్ లోనే ఒక టర్నింగ్ పాయింట్. ఈ సినిమా రిలీజ్ అయ్యి, తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడమే కాకుండా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా వెనుక చాలా పెద్ద కథ ఉంది అదేమిటో తెలుసుకుందాం.

ఈ సినిమాని మమ్ముట్టి హీరోగా, సిద్ధికి దర్శకత్వంలో తమిళ్ లో రూపొందుతున్న ఈ సినిమా ఇది. ఇంకా విడుదల కాలేదు. ఈ సినిమాని అప్పట్లోనే ఒక వారం రోజులు ముందుగా విడుదల చేయాలని తెలుగు రీమిక్స్ రైట్స్ ను కొనాలని నిర్మాత మోహన్ నిర్ణయించుకున్నాడు. ఇక విడుదల అయ్యే వరకు ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియకుండానే విడుదల చేయాలని ఆలోచించాడు. ఇక ఈ సినిమా విడుదల అయ్యే సమయం వచ్చింది.. అక్కడ విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్ కి ఓ సీడీ వచ్చింది.

ఇక ఆ సినిమాను చూడాలంటూ నిర్మాత మోహన్ ప్రముఖ రైటర్ మాధురి రాజుకు చెప్పారట. అసిస్టెంట్ డైరెక్టర్, రాజా తమ్ముడు భార్య కలిసి ఒక హోటల్ రూం లో ఈ సినిమాను చూశారు.దాన్ని చూసి తెలుగులో ఈ సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారట. కానీ ఇదంతా చిరంజీవి తోనే సినిమా చేయాలనుకున్న తర్వాత ఇదంతా జరిగింది.

కానీ అంతకు ముందు ఈ సినిమాకు మోహన్ బాబు ని హీరోగా పెడదామని ఎడిటర్ మోహన్ ఆలోచించారు. కానీ అప్పటికే మోహన్ బాబు మూడు సినిమాలకు కమిట్ అవ్వడం తో ఆ సినిమాను వదులుకోవలసి వచ్చింది. ఆ సినిమాను తమిళ్ లో విడుదల చేయగా మరో మూడు రోజుల తరువాత , ఈ సినిమాని చిరంజీవి నటిస్తున్నట్లు తెలియజేశారు. ఇక ఈ సినిమాకి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య వచ్చిన తర్వాత ఎల్బీ శ్రీరామ్ గారు కూడా వచ్చారు. తెలుగులో ఈ సినిమాకి చిరంజీవి తగ్గట్టుగా కథను మార్చి పెద్ద హిట్ అందుకున్నాడు ముత్యాల సుబ్బయ్య. ఇక ఈ సినిమాను 1997 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు.