చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్..?

బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మనకు గుర్తుండి పోయేలా చాలా హిందీ సినిమాలలో నటించాడు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలలో నటించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మన మెగాస్టార్ చిరంజీవి సినిమాను రీమిక్స్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ సినిమా పేరు లూసిఫర్ .ఈ సినిమాను గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ సినిమాలో పృథ్వీరాజ్ చేశాడు. క్యామీయో రోల్ ని తెలుగులో సల్మాన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది నిజంగా నిజమే అని కొందరు అంటున్నారు. మరికొందరు ఇది ఫేక్ న్యూస్ అని భావిస్తున్నారు.

ఈ విషయాన్ని చిత్ర దర్శకుడైన మోహన్ రాజాని అడిగితే సమాధానం చెప్పటం లేదు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పెట్టిన సమావేశంలో అతిధి గా వచ్చిన మోహన్ ను సుమ దీని గురించి ప్రశ్నించింది.

గౌడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న విషయం నిజమేనా అని అడిగింది. దానికి మోహన్ రాజు సమాధానాన్ని చెప్పటం లేదు. ఇప్పుడు దీని గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని,సరైన సమయంలో ఈ విషయం రిలీజ్ అవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు.

ఇకపోతే చిరంజీవిని డైరెక్ట్ గా చూస్తుంటే నోట్లోనుంచి మాట రావడం లేదు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని వినియోగించుకుంటామనీ అత్యుత్తమ పనితీరు తో ఈ కథకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈసినిమా లో ఫస్ట్ షెడ్యూల్ మొదలయ్యింది. అందులో ఒక ఫైట్ సీను తీశారట. మరి రెండు మూడు రోజుల తర్వాత కొత్త షెడ్యూల్ మొదలు పెడతామని తెలిపారు. తెలుగులో సల్మాన్ ఖాన్ ఎలా నటించబోతున్నాడో చూడాలని ప్రేక్షకులు ఉర్రూతలూగిస్తున్నారు.