చిరంజీవి టీమ్ కు సీఎం జగన్ నుంచి పిలుపు.. వచ్చేనెల ఆ తేదీన?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి టాలీవుడ్ సమస్యలను పరిష్కరించేందుకు వారి సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని సంకల్పించారు.అయితే ఈ విషయం మీద సమావేశం కొరకు రేపు నెల నాలుగవ తేదీన తాడేపల్లి క్యాంపు ఆఫీస్ కు రావాల్సిందిగా జగన్ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ తో సమన్వయం చేసుకునే బాధ్యతల్ని సమాచార మంత్రి పేర్ని నాని తీసుకున్నారు. ఇతనుఒకసారి హైదరాబాద్ కు వెళ్లి చిరంజీవి తో సమావేశం అయి వచ్చారు. చిరు కూడా వివిధ రకాల వ్యాపార వర్గాల ప్రముఖులతో ఒకసారి సమావేశమయ్యారు.

 

సినీ పరిశ్రమకు ఉన్న ఒకే ఒక పెద్ద సమస్య టికెట్లు రేట్లు మాత్రమే. వకీల్ సాబ్ సినిమానే సమయంలో ప్రేక్షకులను దోచుకుంటున్నారని ఆరోపించిన ప్రభుత్వం టికెట్ రేట్లు పూర్తిగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ల టికెట్ రేట్లు తగ్గితే పేదలకు అలాగే నిర్మాతలకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అందువల్ల ఈ సమస్యను జగన్ పరిష్కరించుకోవాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్టోబరులో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ లోపు చర్చలు జరిపి నూరు శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లను సిద్ధం చేయించాలనే ఆలోచనలో సినీ పెద్దలు ఉన్నారు.

Share post:

Popular