చిరంజీవి చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్న వ్యక్తి చిరంజీవి. నిజ జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ ఎన్నో దానాలు చేసిన గొప్ప మనసు చిరంజీవిది. అలాంటి చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఒకసారి చిరంజీవి సినిమా షూటింగ్ సమయంలో ఒక అమ్మాయి సరిగా చేయలేదని కొట్టి ఆ తర్వాత ఆమెకు  స్ప్రైట్ కూడా ఇప్పించారట. ఈ విషయాన్ని ఆ అమ్మాయి స్వయంగా తెలిపింది.

ఆ అమ్మాయి ఎవరో కాదు నాగార్జున హీరోగా నటించిన రాజన్న సినిమాలో మల్లమ్మ పాత్రలో నటించిన బేబీ అని. ఈ పాప స్టాలిన్ సినిమాలో నటించిన విషయం మన  అందరికి తెలిసిందే. ఒకసారి స్టాలిన్ సినిమా షూటింగ్ ఐమాక్స్ జరుగుతున్నప్పుడు వాష్ రూం సన్నివేశం అంతా  ఐమాక్స్ లోనే చేశారు. అయితే ఇందుకోసం థియేటర్ వాళ్ళు కేవలం 9 నుంచి 11 వరకు మాత్రమే షూటింగ్ జరుపుకోవడానికి అనుమతినిచ్చారు. అయితే అప్పటికి నేను చిన్న వయసు లో ఉన్నాను కాబట్టి డైలాగులు చెప్పేటప్పుడు తడబడి పోవడంతో అందరూ ఫాస్ట్  గా చెప్పు అంటూ గోల పెట్టేశారు. అప్పుడు నేను చిరంజీవి ఒళ్లో ఉన్నాను ఆయన కేవలం నా చెంపమీద తాకి ఫాస్ట్ గా చెప్పేయ్ అన్నారు అని తెలిపింది బేబీ ఆనీ.

Share post:

Latest