గాడ్ ఫాదర్ మూవీ సస్పెన్స్.. విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే?

మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసీఫర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు. అయితే తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ను రివీల్ చేయడం జరిగింది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో పలు సినిమాలను తెరకెక్కించిన మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ లో సక్సెస్ ను సాధించుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమాలో రెండు పాత్రలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి చిరంజీవి సోదరిగా ఎవరు నటించబోతున్నారు.

ఆ పాత్రలో నయనతార అయితే బాగుంటుందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.అలాగే మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో కూడా మేక సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఇటీవల దర్శకుడు మోహన్ రాజా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ గాడ్ఫాదర్ లో ఉన్నాడా అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు అన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను అక్టోబర్ నవంబర్ పూర్తి చేసేలా టార్గెట్ ను పెట్టుకున్నారట. అప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా విడుదలయ్యే వరకూ సస్పెన్షన్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

Share post:

Popular