చైల్డ్ ఆర్టిస్ట్ గా రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించిన సినిమా..!

టాలీవుడ్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటే ఎంతో మంది అభిమానులను చూరగొన్నారు. ఇక వీరిద్దరి సినిమా రిలీజ్ అయిందంటే హంగామా అంతా ఇంతా ఉండదు. ఇక ఇద్దరూ పాన్ ఇండియా స్టార్ గా ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒక సినిమా ఉంది. ఆ సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

వీరిద్దరూ నిజానికి ఎవడు సినిమాలో కలిసి మల్టీస్టారర్ మూవీ చేశారు. ఇక ఆ తరువాత వీరిద్దరూ తిరిగి మరి ఏ సినిమాలో నటించలేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరిద్దరూ చిన్నతనంలో కలసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమాలో హీరో చిరు.Ram Charan and Allu Arjun Unseen Photos Must Watch and Share || Creative  Gallery | Creative gallery, Mega star, Power star

దాసరి నారాయణ డైరెక్షన్ లో తీసిన మూవీ “లంకేశ్వరుడు”. ఈ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ , రామ్ చరణ్ సరదాగా గడపడానికి వెళ్లారు.. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ల కోసం వెతుకుతూ ఉండగా, అక్కడికి వచ్చిన రామ్ చరణ్, బన్నీ లని చూసి వీరిద్దరిని చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలో పెడదామని అనుకుంటున్నాడు దాసరి నారాయణ.

ఇక ఈ విషయాన్ని స్వయానా దాసరి నారాయణ గారే చిరంజీవికి తెలుపగా, చిరంజీవి కూడా దానికి సరే అన్నాడు. అలా వీరిద్దరూ కలసి ఆ సినిమాలో నటించగా.. అది కాస్త ఎడిటింగ్ లో వెళ్ళిపోయింది. ఇక అలా వీరిద్దరి కాంబినేషన్ లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాను చూడలేక పోయారు ప్రేక్షకులు.

Share post:

Latest