అయ్యగారి సినిమాలో ఆ సీన్‌కు గూస్‌బంప్స్ గ్యారెంటీ!

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో అఖిల్ నటించిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాయి. దీంతో ఆయన హీరోగా నిలదొక్కుకునేందుకు ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేశాడు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, అయ్యగారు(అఖిల్) తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశాడు. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ మూవీలో నటించేందుకు అఖిల్ రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమా కోసం అఖిల్ ఏ రేంజ్‌లో మేకోవర్ చేస్తున్నాడో మనం ఇటీవల చూస్తున్నాం. ఏకంగా భారీ స్థాయిలో బాడీని పెంచేశాడు అఖిల్. కండలు తిరిగిన హీరోగా అఖిల్ ఈ సినిమాలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రేక్షకులను అబ్బురపరిచే అంశాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది.

ముఖ్యంగా ఈ సినిమాలో ఓ ఛేజింగ్ సీన్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఈ ఛేజింగ్ సీన్ ఏకంగా 15 నిమిషాల పాటు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ పర్యవేక్షణలో ఈ ఛేజింగ్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించగా సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. మరి ఏజెంట్ చేయబోయే ఈ ఛేజింగ్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.