చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్న భారత్ మహిళ అథ్లెట్స్.. !

టోక్యో ఒలంపిక్స్ 20 20 లో ఈరోజు మన భారతదేశంలో ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా భారత దేశానికి రెండు కాంస్య పతకాలు వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే సింధూ కూడా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు మరో రెండు కాంస్య పతకాలు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. ఇక ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

ఆదివారం నాడు పీవీ సింధు కాంస్య పతకాన్ని గెలుచుకోగా, భారతదేశ పురుషుల హాకీ జట్టు నుంచి 49 సంవత్సరాల తరువాత ఇప్పుడు సెమీఫైనల్ కు చేరుకుంది భారత్. 1972 లో తొలిసారిగా భారత జట్టు ఒలంపిక్ గేమ్స్ సెమీ ఫైనల్ కు చేరుకోవడం గమనార్హం. ఇక సోమవారం కూడా ముఖ్యమైన రోజు.. ఎందుకంటే డిస్క్ ప్రో ప్లేయర్ కమల్ ప్రీత్, మహిళా హాకీ జట్టు నుంచి మరొక శుభవార్త వినే అవకాశం ఉంటుందట.

ఇక కమల్ ప్రీత్ కౌర్ మహిళా విభాగంలో ఫైనల్ కీ ప్రవేశించడం జరిగింది. అంతే కాకుండా పథకం కచ్చితంగా గెలుస్తుంది అనే భావన కలిగిస్తుంది. ఇక మహిళల హాకీ జట్టు విషయానికి వస్తే, క్వార్టర్ ఫైనల్లో వీరు ఆడుతున్నారు. ఇక వారు గెలిస్తే, మొదటిసారి వీరు గేమ్స్ లో సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.

ఇక అంతే కాకుండా మరొక విషయం ఏంటంటే, ఈ రోజు షూటింగ్ లో భారత్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అట్లాంటిక్ మహిళా జ్యోతి చందు ట్రాక్లో నిలబడ్డారు. సోమవారం టోక్యో ఒలింపిక్స్ లో భారత్ షెడ్యూల్ ఇలా ఉంది ఒకసారి చూద్దాం.

అథ్లెటిక్స్:
ఈరోజు ఉదయం 7:25 – ధ్యుతి చంద్ .. మహిళల విభాగంలో 200 మీటర్ల రన్నింగ్ పోటీ.

ఈ రోజు సాయంత్రం 4:30 – కమల్ ప్రీత్ కౌర్, మహిళల విభాగంలో డిస్కస్ త్రో ఫైనల్ జరగనుంది.

హార్స్ రైడింగ్:
ఈరోజు మధ్యాహ్నం 1:30 – ఫవాద్ మీర్జా.. జంపింగ్ విభాగంలో వ్యక్తిగత క్వాలిఫైయర్

ఈ రోజు సాయంత్రం 5:15 – ఈరోజు వ్యక్తిగత జంపింగ్ ఫైనల్స్ ఈవెంట్ జరగనుంది.

హాకీ :
ఈరోజు ఉదయం 8:30 – ఆస్ట్రేలియా , ఇండియా మధ్య మహిళల హాకీ క్వార్టర్ ఫైనల్స్ జరగనున్నాయి.

షూటింగ్:
షూటింగ్ విభాగంలో ఈరోజు ఉదయం 8:00 సందీప్ రాజ్ పుత్ అలాగే ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ లు పోటీ పడనున్నారు. పురుషుల విభాగంలో 50 మీటర్ల రైఫిలు మూడవ పొజిషన్ కు అర్హత చెందారు.

మధ్యాహ్నం : 1:20 పురుషుల విభాగంలో 50 మీటర్ల రైస్మిల్ మూడవస్థానం ఫైనల్ జరగనున్నాయి.

ఇక ఇది ఒలంపిక్స్ యొక్క ఈరోజుటి అప్డేట్స్.