కాఫీ ,టీ అమ్మి బ్రతుకుతాను అంటున్న రాజా రవీంద్ర ..!

సినిమాలలో ఎంతోమంది నటులు నటీమణులు తమ నటనని చాలా బాగా ప్రదర్శిస్తుంటారు. అయితే వారికి నటనంటే మక్కువ ఎక్కువ కాబట్టే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధ పడుతుంటారు.ఆ మక్కువ తోనే కొంతమంది సీనియర్ నటులు కూడా మళ్లీ సినిమాల్లోకి రావడానికి ప్రయత్నిస్తారు. అందులో ఒక నటుడు తాజాగా సినిమాల్లోకి రావటానికి ఎక్కువ కుతూహలంగా ఉన్నారు.. ఆయనే రాజా రవీంద్ర.. ఈ సీనియర్ నటుడు సినిమాల మీద ఎంతో మక్కువ చూపుతున్నారు.

ఆయన సినీ ఇండస్ట్రీలో ఏ పని చేయడానికైనా సిద్ధమేనని చెబుతున్నాడు. ఇక ఈయన చెప్పిన కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం.

ఈయన చిత్రపరిశ్రమలో 35 ఇయర్స్ గా ఉండి, ఈ నటుడు తన కంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఎక్కువ సినిమాలలో విలన్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో రాబోతున్న క్రేజీ అంకుల్ సినిమాలోకూడా నటించాడు. సింగర్ మనో, రాజా వీరేందర్ మిగతా వాళ్లు హీరోలుగా నటించనున్నారు. ఈ క్రేజీ అంకుల్ సినిమా ఈనెల 19న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలను తెలిపారు.

గత సంవత్సరం కరోనా సమయంలో ఇండస్ట్రీ మొత్తం చాలా ఇబ్బందులలో పడ్డారు. నేను కూడా చాలా ఇబ్బందులకు గురయ్యానని తెలియజేశాడు. కానీ నేను క్రేజీ అంకుల్ సినిమాకు కరోనా టైంలో కూడా ప్రతిరోజు తప్పకుండా వెళ్లేవాడిని అని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా చాలా తొందరగా అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ కొంతమంది చెప్పటం వల్ల థియేటర్లలో విడుదల చేయటం చాలా మంచిది అనుకున్నారట.

ఈ సినిమాలో కామెడీ సీనియర్ నటుడు పోసాని తన క్యారెక్టర్ ను చాలా అద్భుతంగా చేశారు. అని చెప్పుకొచ్చాడు. తనకు సినిమాలంటే చాలా పిచ్చి అందువలన ఏ పాత్రనైనా పోషించటానికి నేను రెడీ అన్నాడు. ఎలాంటి పాత్రలు లేకపోతే సినీ ఇండస్ట్రీలో కాఫీ టీలు ఇవ్వడానికైనా నేను సిద్ధమే అన్నాడు. ఈ మాటని నేను ఎన్ని సార్లైనా చెపుతాను అని రాజా రవీంద్ర తెలపడం తో ఆయనకు సినిమాలంటే ఎంత ఇష్టమో అంటూ పలువురు ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు.

Share post:

Popular