బ్రేకింగ్ : ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌..!

తాలిబన్ల అరాచకాలు ఎక్కువవుతున్న తరుణంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాబూల్ లో ఉక్రెయిన్ కు సంబంధించిన విమానాన్ని గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేశారు. తాలిబన్లు తమ దేశం కాని వారిని వెళ్లిపోమన్న సంగతి తెలిసిందే. అయితే పరదేశ ప్రజలు తమ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఏ దేశానికి చెందిన అధికారులు వారి విమానాలు పంపిస్తున్నారు. తమ ప్రజలను రక్షించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ దేశానికి చెందిన ప్రజల కోసం ఆ దేశ అధికారులు ప్రత్యేక విమానాన్ని పంపించారు. అయితే అది హైజాక్ అయ్యింది.

ఆ విమానం ఇరాన్ కు తీసుకెళ్లినట్లుగా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి స్ఫష్టం చేశారు. తమ విమానాన్ని ఆప్ఘనిస్థాన్ కు వెళ్లకుండా దుండగులు ఇరాన్ కు తరలిస్తున్నట్లుగా సమాచారం అంందిందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి ఎవ్జెవీ ఎనిన్ వెల్లడించారు. ఆదివారం పంపిన విమానంలో 83 మంది కీవ్ కు చేరుకున్నారు. ఇకపోతే ఆప్ఘనిస్థాన్ లో ఇంకా వంద మంది ఉక్రెయినియన్ ప్రజలు ఉన్నారని వారు స్పష్టం చేశారు. వారిని కూడా త్వరలోనే స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు.

Share post:

Latest