బ్రేకింగ్ : కేంద్ర మంత్రి అరెస్ట్…?

సాధారణంగా ప్రజెంట్ టైమ్స్‌లో కార్పొరేటర్ లేదా సర్పంచ్ స్థాయి ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయడానికే పోలీసులు జంకుతుంటారు. కానీ, ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు ఏకంగా కేంద్రమంత్రిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఆయనెవరు.. ఎందుకు అరెస్ట్ చేశారంటే..
మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పని చేసిన ఈ నేత ప్రస్తుతం కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన పేరు నారాయణ్ రాణే. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్ మరిచిపోయారని నారాయణ్ రాణే విమర్శించారు.

- Advertisement -

ఉద్ధవ్ ఠాక్రే స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది మర్చిపోవడం సిగ్గుచేటని, ఒకవేళ తాను అక్కడే ఉంటే ఉద్ధవ్‌ను గట్టిగా కొట్టేవాడినని కేంద్రమంత్రి రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై శివసేన ఫుల్ సీరియస్ అయింది. రాణేపై నాసిక్ పోలీసులకు శివసేన ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర పోలీసులు కేంద్ర మంత్రిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మహారాష్ట్ర సీఎం థాక్రేను ఉద్దేశించి కేంద్రం మంత్రి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కాగా, కేంద్ర మంత్రి రాణేపై పూణే నగరంలోని చతుర్ శృంగి పోలీసులు ఐపీసీ సెక్షన్ 153, 505 కింద కేసు నమోదు చేశారని తెలుస్తోంది.

Share post:

Popular