సరికొత్త టాస్క్‌లతో ‘బిగ్ బాస్’ సీజన్ 5..?

తెలుగులో సూపర్ హిట్ అయిన ప్రోగ్రామ్స్‌లో ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఒకటని చెప్పొచ్చు. ఈ షోలో పార్టిసిపేట్ చేస్తే చాలు.. ఆ తర్వాత సెలబ్రిటీల క్రేజ్ ఇంకా పెరిగే చాన్సెస్ తప్పక ఉన్నాయి. ఇప్పటికే ఈ షో లో పార్టిసిపేషన్ చేశాక అనగా బుల్లితెరపై సందడి చేశాక చాలా మంది వెండితెరపై మెరిశారు. మోనాల్ గజ్జర్, అరియానా తదితరులకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కాబోతున్నది. ఈ షో‌కు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

అయితే, ఇంతకుముందు సీజన్స్ టీఆర్పీ రేటింగ్స్ సీజన్ వైజ్‌గా తగ్గుతూ వచ్చిన క్రమంలో ఈసారి టీఆర్పీ రేటింగ్స్ పెంచేందుకు ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్నారు. విభిన్నమైన టాస్కులతో ప్రేక్షకులను ఈ సారి అలరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ కంటెస్టెంట్‌గా ఎంత మంది సెలబ్రిటీలు వెళ్లబోతున్నారు అనేది ఇంకా తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇంకా రాలేదు. కాగా, సీజన్ ఫైవ్ టాస్కులు చూస్తే ప్రేక్షకులు షాక్ అయ్యే విధంగా, వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.