ఆ ఆఫర్‌ను తిరస్కరించిన యాంకర్‌, సింగర్‌..?

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్‌కు సంబంధించిన పలు ఆసక్తికర అప్‌డేట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి హౌజ్‌లో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్‌ గురించి ఇంట్రెస్టింగ్ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. 5వ సీజన్‌లో ప్రముఖ యాంకర్ వర్షిణి, పాపులర్ సింగర్‌ మంగ్లీలు పాటిస్పేట్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే.. ఒక లేటెస్ట్ న్యూస్ టీవీ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. అదేంటంటే.. యాంకర్ వర్షిణి, సింగర్ మంగ్లీ బిగ్‌బాస్‌ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం మంగ్లీ స్టార్ హీరోల సినిమాల్లో పాటలు పాడుతూ చాలా బిజీగా ఉన్నారు. ఇక వర్షిణి కూడా చాలా షోలలో యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు. దాంతో వీళ్లిద్దరూ కూడా బిగ్‌బాస్‌ ఆఫర్‌ను తిరస్కరించారని సమాచారం. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన విడుదలయ్యేంతవరకూ వేచి చూడాల్సిందే. వాస్తవానికి గత సీజన్ లో కూడా మంగ్లీ వస్తారని వార్తలు వచ్చాయి. కానీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నందున ఆమె బిగ్‌బాస్‌ హౌజ్‌లో అరంగేట్రం చేయలేకపోయారు.