నానితో నితిన్ బిగ్ ఫైటింగ్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

న్యాచుర‌ల్ స్టార్ నానితో బిగ్ ఫైటింగ్‌కు సిద్ధ‌మ‌య్యాడు యూత్ స్టార్ నితిన్‌. అస‌లు మ్యాట‌రేంటంటే.. నాని, ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `టక్‌ జగదీష్‌‌`. గ్రామీణ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా న‌టించారు.

Tuck Jagadish OTT Release Date?

సాహు గారపాటి – హరీశ్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. ఏప్రిల్లో విడుదల కావలసిన ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా ఈ చిత్రం ఓటీటీ వేదికగానే విడుద‌ల కానుంది. ఈ విషయం పై ఇప్పటికే నాని ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న కానున్న‌ట్టు స‌మాచారం.

Nithiin Maestro announces music fest - tollywood

మ‌రోవైపు నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `మాస్ట్రో`. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘అంధాదున్’ సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో నభా నటేశ్ హీరోయిన్‌గా.. త‌మ‌న్నా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అలాగే ఇందులో నితిన్ అంధుడిగా కనిపించనున్నాడు. అయతే ఈ చిత్రాన్ని కూడా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌నున్నార‌ని జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇదే నిజ‌మైతే ఓటీటీ వేదిక‌గా ఒకే రోజు ఈ ఇద్ద‌రు హీరోలు నువ్వా-నేనా అంటూ త‌ల‌ప‌డ‌నున్నారు.

Share post:

Popular