కొంప‌ముంచిన ‘దిగు దిగు దిగు నాగ’..చిక్కుల్లో నాగ శౌర్య మూవీ!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య తాజాగా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్టర్స్, టీజర్‌కు మంచి ఆద‌ర‌ణ రాగా.. ఈ మ‌ధ్య `దిగు దిగు దిగు నాగ` అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

Varudu Kaavalenu Music review songs lyrics - IndiaGlitz.com

తెలంగాణ జానపదం దిగు దిగు దిగు నాగ అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు. థమన్ సంగీతం అందించగా ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చ‌గా.. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ ఆల‌పించారు. యూట్యూబ్‌లో విడుదలై ఈ పాట నెటిజన్స్‌ను ఎంతోగాను ఆకట్టుకుంటోంది. అయితే సూప‌ర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఆ పాటే ఇప్పుడు కొంపముంచింది.

Varudu Kavalenu plans special surprise for Naga Shaurya - tollywood

తాజాగా వ‌రుడు కావ‌లెను సినిమాను బ్యాన్‌ చేయాలని కోరుతూ శనివారం బాచుపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్‌ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సినిమాలోని ‘దిగు దిగు దిగు నాగ’ పాట హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని, ఆ పాటను వెంటనే తొలగించి బేషరుతుగా చిత్ర దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. మ‌రి ఈ వివాహం ముందు ముందు ఎక్క‌డికి చేరుకుంటుందో చూడాలి.

Share post:

Popular