ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు సిద్దం అవుతున్న బి‌సి‌సి‌ఐ..?

ఒలింపిక్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గేమ్స్. అందులో అనేక మంది క్రీడాకారులు పాల్గోని తమ సత్తాను చాటుతుంటారు. ఇందులో తాజాగా భారత అథ్లెట్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. అయితే ఒలింపిక్స్ లో క్రికెట్ మాత్రం లేదు. ఎప్పటి నుంచో ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చాలని చాలా మంది పోరాడుతున్నారు. 1900వ సంవత్సరం పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌న కూడా ఒలింపిక్స్ లో ఉండేది. ఆ తర్వాత దానిని కొనసాగించలేదు. ఇప్పుడు బీసీసీఐ క్రికెట్ అభిమానులు ఓ తీపికబురు చెప్పింది.

ఒలింపిక్స్ లో క్రికెట్ ను ఎప్పుడు చేరుస్తారోనని ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. బీసీసీఐతో కలిసి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ) ఇది వరకూ చాలా సార్లు చర్చలు జరిపింది. ఆ టైంలో బీసీసీఐ ఒప్పుకోకపోవడంతో అది సాధ్యపడలేదు. అయితే 2028వ సంవత్సరం లాస్‌ ఏంజెల్స్‌లో నిర్వహించే ఒలింపిక్స్‌లో మాత్రం క్రికెట్‌ ఆట ఉండనున్నట్లు తెలుస్తోంది. 8 జట్ల మధ్య టీ 20 లేదా టీ 10లు ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.