చిన్నారి పెళ్లికూతురు ఇంట్లో సిసి కెమెరాలు.. అతర్వాత ఏం జరిగిందంటే?

కమెడియన్ రాహుల్ రామకృష్ణ అలాగే హీరోయిన్ అవికాగోర్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా నెట్. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ అవికాగోర్ ప్రియ అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది. రాహుల్ రామకృష్ణ అశ్లీల చిత్రాలు వీక్షించే యువకుడిగా కనిపిస్తాడు . ఈ నేపథ్యంలోనే ప్రియా ఇంట్లో ఒక సీక్రెట్ కెమెరానీ ఉంచి వాటి ద్వారా ఆమె ప్రతి కదలికలను గమనించిన రాహుల్ చివరకు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అన్న ఆసక్తికర అంశాలతో ఈ సినిమాను రూపొందించారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ఇందులో మహిళల గోప్యత అలాగే భద్రత లాంటి అంశాలపై చర్చను లేవనెత్తేలా ఈ ట్రైలర్ కొనసాగుతుంది. ఈ సినిమాకు నరేష్ కుమరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ కొంచెం కొత్తగా ఉంది. అలాగే ఎడిటర్ రవితేజ గిరిజాల పర్ఫెక్ట్ కట్స్ తో, నాయర్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. టీజర్ చూస్తూనే ఆ సినిమా పై ఆసక్తి పెరుగుతోంది.