అప్పుడు ’అంబటి‘.. ఇప్పుడు ’అవంతి‘… అసలు వైసీపీలో ఏం జరుగుతోంది?

ఏపీ మంత్రి, సీనియర్ నాయకుడు అవంతి శ్రీనివాస్ ఓ మహిళతో సరసాలాడుతూ మాట్లాడటం, ఆమెను ఇంటికి రమ్మని పిలవడం .. ఆడియో ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. గతంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు వాయిస్ ను పోలిన ఆడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంబటి, అవంతి ఆడియో వ్యవహారాలు గమనిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏం అర్థంకాక మౌనం వహిస్తున్నారు. పార్టీలో ఏదో జరుగుతోంది.. కావాలని ఎవరో చేస్తున్నారా ? లేక నిజంగానే వారు మాట్లాడారా అనేది అర్థం కాక క్లోజ్ ఉన్న నాయకులతో ఆరా తీస్తున్నారు.

గతంలో అంబటిపై వచ్చినపుడు ఆయన ఆ సమస్య నుంచి బయటపడ్డాడు. ఆ తరువాత మళ్లీ ఇపుడు మరోసారి వచ్చాయి. అంబటి వ్యవహారం సద్దుమణిగిందో, లేదో అవంతి ఆడియో బయటకు వచ్చింది. ఏం చేస్తున్నావ్.. వచ్చేసెయ్.. అరగంటలో పంపిచ్చేస్తా అని మేల్ వాయిస్ అనడం, రాలేను సర్, ఇంట్లో వాక్ చేస్తున్నా.. ఆమె సమాధానం చెప్పడం.. ఇద్దరూ సరసాలాడుతున్నట్లు అనిపించడం.. చర్చనీయాంశమైంది. ఈ విషయంపై మంత్రి అవంతి ఘాటుగా స్పందించారు. వైసీపీ బలంగా ఉండటంతో పార్టీని దెబ్బతీనయడానికి తనపై కావాలనే కొందరు ఈ దుష్ప్రచారానికి దిగారని ఖండించారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, నిజమేంటో వారే నిగ్గు తేలుస్తారని పేర్కొన్నారు. అయితే పార్టీలో జరుగుతున్న ఇటువంటి వ్యవహారాలను అధినేత, సీఎం జగన్ ఏమాత్రం సహించరని, బాధ్యులపై కచ్చితంగా తగిన సమయంలో చర్యలు తీసుకుంటారని సీనియర్ నాయకులు చెబుతున్నారు. మరి అవంతి ఆడియో.. విచారణలో ఏమని తేలుతుందో ఆ భగవంతుడికే తెలియాలి.