అతని వల్లే కాజల్ సినీ ఇండస్ట్రీకి దూరం కాబోతోందా..?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఎవరంటే కాజల్ అని చెబుతూ ఉంటారు. ఈమె తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల సరసన నటించి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది.

ఇక పెళ్లయిన తర్వాత కూడా ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉండటం విశేషం. అయితే ఈమె తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన భర్త కోసం ఈమె సినిమాలకు దూరంగా ఉండబోతున్న ట్లు సమాచారం. పోయిన సంవత్సరం కాజల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు పెళ్లి తర్వాత వేరు ఒక వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టారు. అయితే ఇటీవల కాజల్ పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరం కాబోతుంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల పై కాజల్ తాజాగా స్పందించింది.

కాజల్ ఇప్పుడే సినిమాలకు దూరం కావాలని అనుకోవడం లేదట. తన భర్త గౌతమ్ ఎప్పుడూ సినిమాలకు దూరం అవమని చెబితే ,అప్పుడు దూరం అవుతానని కాజల్ అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత ఈమె ఎక్కువగా సినీ ఇండస్ట్రీ వైపు ఉండడంతో , తన భర్తతో సమయం గడపలేక పోతున్నానన్న కారణం తోనే ఆమె కొద్దిరోజులు సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిందట. ఇక కాజల్ సినీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలను కొట్టేస్తోంది అని చెప్పవచ్చు. ఇటు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూనే ,తన భర్త ఈమె కలిసి సంయుక్తంగా పెట్టిన బిజినెస్ వ్యవహారాలలో కూడా కాజల్ చూసుకుంటోంది. ఇక అంతే కాదు గతంలో కొన్ని గోల్డ్ ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పని చేసిన విషయం తెలిసిందే.