అసిస్టెంట్ డైరెక్టర్ నుండి క్రియేటివ్ డైరెక్టర్ గా మారిన శంకర్ ..!

సామాజిక సమస్యలను తమ సినిమాల్లో చూపించే ప్రధాన డైరెక్టర్లలో శంకర్ కూడా ఒకరు. సోషల్ ప్రాబ్లమ్స్ కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ మొప్పించడం ఆయనకు సాటి ఎవరూ రారు. ఇక దక్షిణాది సినిమాలలో.. ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ శంకర్. ఇక ఈయన పుట్టిన రోజు నేడు.. కావున ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

డైరెక్టర్ శంకర్ తీసిన భారతీయుడు సినిమా దేశభక్తి కోసమే ఈ సినిమాను చేశాడు అనే విధంగా కనిపిస్తుంది. ఇక దేశం గర్వించదగ్గ డైరెక్టర్ శంకర్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈయన తన మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఈయన సినిమాల కోసం నిర్మాతలు ఎంత ఖర్చు చేసిన వారికి లాభం గానే చేకూరుతుంది. తనను డైరెక్టర్ గా చేసిన జెంటిల్మాన్ మొదటి సినిమా నుంచి.. రీసెంట్ గా విడుదలైన అక్ష 2.0 మూవీ వరకు శంకర్ ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేశాడు.

ఇక ప్రస్తుతానికి కమల్ హాసన్ తో భారతీయుడు-2 సినిమా చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ కారణంగా కొంత మంది మరణించిన విషయం కూడా తెలిసిందే. అందుచేతనే సినిమా షూటింగ్ ను కొద్దిరోజులు హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమానీ దిల్ రాజు నిర్మిస్తున్న ట్లు తెలుస్తోంది. అంతే కాదు బాలీవుడ్ రణవీర్ సింగ్ తో అపరిచితుడు సినిమాని రీమేక్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈయన 1963 ఆగస్టు 17న తమిళనాడులోని కుంభకోణం లో జన్మించారు. ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈయన మొట్ట మొదటి సారిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభించి స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.