నువ్వు నేను బ్యూటీ అనితను ఇలా చూస్తే తట్టుకోగలరా?

అప్పట్లో వచ్చిన నువ్వు నేను సినిమా లో హీరో ఉదయ్ కిరణ్ సరసన నటించిన అనితా హంసానందాని గురించి మనందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమా తరువాత ఈమె కొన్ని సినిమాలలో నటించి ఆ తర్వాత ఆ సిని ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడే స్థిరపడింది. ఈమె బిజినెస్ మాన్ రోహిత్ రెడ్డి ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా ఈ దంపతులకు ఒక పండంటి కుమారుడు కూడా జన్మించాడు. అయితే హంసానందదాని నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది.

అయితే ఇటీవల మాల్దీవుల వెకేషన్ నుండి పోస్ట్ కార్డులను పంచుకున్నారు. ఆ తరువాత హిమాచల్ ప్రదేశ్ లోని వెకేషన్ ని ఎంజాయ్ చేసారు. ఇక అప్పటి నుంచి వరుసగా వారి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉన్నారు. అలాగే ఈ ఇద్దరూ కలిసి తన కుమారుడితో కలిసి ఉన్న ఫోటోలు కూడా పంచుకున్నారు. అయితే తాజాగా అనిత బీచ్ వేర్ ధరించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటో కాదు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.