టాలీవుడ్‌లో బంప‌ర్ ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరో కూతురు!?

తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా తెర‌కెక్కిన ఎంతవాడు గానీ, విశ్వాసం వంటి చిత్రాల్లో.. ఆయ‌న‌ కూతురుగా నటించి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది అనికా సురేంద్రన్. అయితే ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ త్వ‌ర‌లోనే టాలీవుడ్‌లోకి అడుగు పెట్ట‌బోతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ల‌యాళంలో సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచిన‌ సినిమా `క‌ప్పెల`ను తెలుగు లో రీమేక్ చేస్తున్నారు.

Child actor Anikha spills beans on Ajith's Viswasam - Movies News

చంద్ర‌శేఖ‌ర్ టీ ర‌మేష్ ఈ రీమేక్‌తో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం కాబోతున్నాడు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న‌ ఈ చిత్రంలో సిద్దు జొన్న‌ల గ‌డ్డ‌, అర్జున్ దాస్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం అనికా సురేంద్ర‌న్‌ను ఎంపిక చేశారు.

Anikha Surendran - Bio, Age, Net Worth, Height, Nationality, Body  Measurement, Career

ఇప్ప‌టికే సంప్ర‌దింపులు పూర్తి కాగా.. త్వ‌ర‌లోనే అనికా షూటింగ్‌లో కూడా జాయిన్ కానుంద‌ని స‌మాచారం. అయితే అనికా న‌టించ‌బోయే ఆ పాత్ర కోసం మొద‌ట రాజ‌శేఖ‌ర్ కూతురు శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌ను అనుకున్నారు. కానీ, ఏమైందో ఏమో గానీ.. ఇప్పుడు అనికాను తీసుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

Anikha Surendran: Anikha Surendran looks breathlessly beautiful as she dons  the festive look | Malayalam Movie News - Times of India