కొత్త బాస్ కావాలి బాసూ..!  ఏపీలో పీసీసీ అధ్యక్షుడిని మార్చే ఛాన్స్..?

ఆంధ్ర్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది.. ఆ పార్టీ రాష్ట్రంలో ఉందా అంటే.. ఉంది అంతే.. అంతకుమించి ఇంకేమీ చెప్పలేం. అందుకే పార్టీ అధిష్టానం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ద్రుష్టి సారించింది. తెలంగతాణ ఏర్పడ్డ తరువాత ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ జీరోకు పడిపోయింది. పీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డి నియమితులైన తరువాత పార్టీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. వయసు కారణంగా ఆయన స్థానికంగానే ఉండిపోయారు. ఆ తరువాత శైలజానాథ్ కు పార్టీ పగ్గాలు అప్పగించింది అధిష్టానం.  శైలజానాథ్.. పార్టీని బతికించే ప్రయత్నం చేస్తాడేమో అనుకుంది హైకమాండ్.. అయితే ఆయన అక్కడ చేసిందేమీ లేదు.. అప్పుడప్పుడు మీడియా సమావేశాల్లో మాట్లాడటం తప్ప.  ఆయన తన ఊళ్లో ఆలయ నిర్మాణానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ గురించి అసలు పట్టించుకోవడం లేదని కార్యకర్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త బాస్ ను నియమించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అయితే ఎవరిని? అనేది తేల్చలేకపోతున్నారు. పార్టీలో పెద్దగా వాయిస్ ఉన్న లీడర్ లేడు. ఉన్న కొద్ది మంది వైసీపీలో చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో ఎవరివైపు మొగ్గు చూపుదామని అధిష్టానం అభిప్రాయాలు అడుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి.. రాష్ట్రం విడిపోయిన తరువాత కొత్త పార్టీ స్థాపించి.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికే ఇద్దామని చాలా మంది అభిప్రాయపడినట్లు సమాచారం. ఆయనకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉండటం.. ఇతర పార్టీల్లో గుర్తింపు ఉండటం లాంటివి నల్లారికి కలిసొచ్చే అంశాలు కావడంతో ఆయన పేరు తెరపైకి వచ్చిం. అయితే పగ్గాలు చేపట్టేందుకు నల్లారి వారు ఏమంటారో మరి..