అల్లు అర్జున్ అంటే క్రష్ అంటున్న యంగ్ హీరోయిన్..

తన నటనతో, తన స్టెప్పులతో ఎంతో మంది గుండెల్లో నిలిచిన మన స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతోమంది అతని సినిమాను చూడటానికి ఎంతో తాపత్రయంతో ఎదురుచూస్తుంటారు. ఇకపోతే చాలామంది అమ్మాయిలకు అల్లుఅర్జున్ కలల రాకుమారుడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే ..ఇకపోతే ఈ హీరో అంటే ఒక అమ్మడుకు ఎనలేని ప్రేమ అట.. ఆ అమ్మాయి ఎవరో కాదు టాక్సీ వాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్..

విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. కానీ ఈ సినిమాతో ఈమె పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక ఆ తరువాత పలు సినిమాలలో కూడా ఎక్కువ అవకాశాలు తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటోస్ తో హల్ చల్ చేస్తోంది.

అంతేకాదు తనకు అల్లు అర్జున్ అంటే క్రష్ అని తెలిపింది. మొదట షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. 2017లో కలవరమాయే మొదటి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తరువాత టాక్సీ వాలాలో నటించింది. ఈ మధ్యకాలంలో తిమ్మరుసు సినిమా లో నటించగా మంచి సక్సెస్ ను అందుకుంది .
ఇదిలా ఉంటే ఇక తాజాగా ఎస్ .ఆర్ కళ్యాణమండపం ఈ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకోగా కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంది.

తను మీడియాతో మాట్లాడుతూ తన మేకప్ వల్లే నేను ఇంత అందంగా కనిపించడానికి కారణం అని చెప్పింది. తన అందం విషయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, తను నాజూగ్గా, గ్లామర్ గా కనిపించటానికి చెప్పట్టిన చికిత్సలతో కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పింది. అంతేకాకుండా తనకు థైరాయిడ్ ఉందని ఫేస్ పై పింపుల్స్, శరీరం వెయిట్ లో మార్పులు వచ్చాయని తెలియజేసింది. తను ఆరోగ్యం పట్ల , శరీరం పట్ల ఎంతో శ్రద్ధ చూపిందని చెప్పింది. వెయిట్ లాస్ తనకు చాలా కష్టమని తెలిపింది. ఇంకా తను పెద్ద హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని చాలా తపన పడుతోంది. అంతేకాకుండా తను గుర్తుండేలా పాత్రలను చేయాలని నిర్ణయించుకుంది.

Share post:

Latest