అల్లరి సుభాషిణి ప్రాణాలను కాపాడింది ఆయనే..!

అల్లరి నరేష్ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు చేసుకుంది సుభాషిని. ఆ తరువాత ఈమె ఎన్నో సినిమాలలో కమెడియన్ గా చేసి మంచి పేరు సంపాదించుకున్నది. కొద్దిరోజుల క్రితమే ఒక షోలో తనకు క్యాన్సర్ ఉన్నదని తెలియజేసింది.. దానికి కోలుకోవడానికి చాలా రోజులు పట్టిందని తెలిపింది. ఆ విషయాలను ఒకసారి చూద్దాం.

జబర్దస్త్ షో లో ఈమె ఇటీవల రాకేష్ టీమ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఈ స్కిట్ అయిపోయిన తర్వాత తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ కొన్ని వాక్యాలను వెల్లడించింది. కెసిఆర్ తనకు ప్రాణదానం చేసిన వ్యక్తి అని ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది. ఈమెకు ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యునికి సంప్రదించగా అది క్యాన్సర్ అని తేలిందట.

క్యాన్సర్ ను చికిత్స చేయించడం కోసం దాదాపు పదిహేను లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పగా.. ఆ సమయంలో తన ప్రగతి భవన్ కు వెళ్లగా తన ఆరోగ్య శ్రీ కింద కేవలం 5000 రూపాయలు ఖర్చు తోనే తనకు కేసీఆర్ వైద్యం చేయించారు అని చెప్పుకొచ్చింది సుభాషిని. కేసీఆర్ కు నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలుపుతు వచ్చింది ఈమె. అంతేకాకుండా మూవీ అసోసియేషన్ నుంచి తనకి లక్ష రూపాయలు సహాయం చేసారని చెప్పుకొచ్చింది సుహాసిని.

మెగా ఫ్యామిలీ నుండి కూడా కొంచెం ఆర్థిక సహాయం అందించారని చెప్పుకొచ్చింది. తనకి కూడా సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని త్వరలోనే మరి రీఎంట్రీ ఇస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఈమె కూడా మరి తిరిగి పాతకాలం సుభాషిని మాదిరే బిజీ కావాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

Share post:

Latest