అలా చేసి కష్టంలో కూడా సుఖం పొందుతున్న శిల్పాశెట్టి..

శిల్పా శెట్టి.. ప్రస్తుతం ఈమె పేరు,ఈమె భర్త పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఇందుకు కారణం ఇటీవల అశ్లీల యాప్ ల నిర్వాహకుడిగా, రుజువు అయినందున శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే నిజా నిజాలు తెలియకుండా తమకు సంబంధించిన గోప్యతను భద్రంగా ఉంచాలని , ఆమె మీడియా ను కూడా కోరింది. వీరిని విమర్శించిన కొన్ని మీడియా వర్గాల పై కూడా శిల్పా శెట్టి కేసు కూడా పెట్టారు. కానీ ఈ కేసును ముంబై కోర్టు తిరస్కరించింది. ఇక తన భర్త రాజ్ కుంద్రా అరెస్టయిన తర్వాత ఆమె మీడియాకు కూడా దూరంగా ఉంటూ వచ్చింది. కానీ కొంత మంది స్టార్ సెలబ్రెటీలు ఈమెకు మద్దతుగా నిలుస్తున్నారు అంటూ చెప్పడంతో, ఇంస్టాగ్రామ్ లో తనదైన శైలిలో వారికి ధన్యవాదాలు కూడా తెలిపింది శిల్పా శెట్టి.

దాదాపుగా కొంతకాలం తర్వాత తాజాగా వర్చువల్ ఈవెంట్లో శిల్పాశెట్టి ఫిట్నెస్ టీచర్ గా దర్శనమిచ్చింది. ఇందులో శ్వాస వ్యాయామాలు ఎలా చేయాలో కూడా మనం చూడవచ్చు. కరోనా ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు శ్వాస మీద ఆధారపడి జీవిస్తున్నారు.. అంటూ తెలిపింది. శ్వాస ప్రక్రియ ద్వారా మన శరీర వ్యవస్థ కూడా ఆధారపడి ఉంటుందని కూడా ఆమె తెలిపింది. ప్రతి ఒక్కరి నాసిక మార్గాన్ని శుభ్రంగా ఉన్నప్పుడే స్వయంచాలకంగా ఆక్సిజన్ మెదడు కణాలకు చేరుతుందని , రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని స్వయంగా ఈ ప్రక్రియ చేస్తున్నానని కూడా శిల్పాశెట్టి తెలిపింది.

అంతేకాదు గడ్డు కాలంలో కూడా ఆమె శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య సుఖాన్ని పొందుతోంది