హీరో సత్యదేవ్ కు బెదిరింపులు…?

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న హీరో ఎవరంటే సత్యదేవ్ అనే చెప్పొచ్చు. ఈ యంగ్ హీరో విభిన్న కాన్సెప్ట్స్ తో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా ఈ హీరోకు చంపేస్తామనే బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని సత్యదేవ్ ఓ కార్యక్రమంతో తెలిపాడు. తీవ్రవాదం బ్యాగ్రౌండ్ లో హబీబ్ అనే హిందీ మూవీలో సత్యదేవ్ నటిస్తున్నాడు.

ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్దంగా ఉంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు చేపడుతుండగా ఓ చాటింగ్ సెషన్ నిర్వహించారు. తాలిబన్లు తీవ్రమైన పోరాటం చేస్తుండగా అక్కడికి వెళ్లి షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో రిస్క్ తో కూడిన షూటింగ్ చేస్తుండగా కొందరు చంపేస్తామని బెదిరించినట్లు సత్యదేవ్ తెలిపాడు. కాబూల్ లో తాలిబన్ల నుంచి బెదిరింపుల వచ్చినప్పటికీ సత్యదేవ్ హబీబ్ సినిమాను పూర్తి చేసినట్లుగా తెలిపాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో హబీబ్ మూవీ విడుదలకు సిద్దమవుతోంది. .

Share post:

Latest