డైరెక్టర్ అంటూ నటికి ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

బెంగాలీ బుల్లితెర నటి పాయల్ సర్కార్ ఒక వ్యక్తి తాను ప్రముఖ డైరెక్టర్ అంటూ అసభ్యకర సందేశాలు పంపుతున్నారు అంటూ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఫేక్ అకౌంట్ ద్వారా అసభ్యకర పదజాలంతో మెసేజ్ లు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక వ్యక్తి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగా ఆమె అతని ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడగా ప్రముఖ బెంగాలి దర్శకుడు రవి కినాగి ఫోటోలు దర్శనమిచ్చాయి. దీనితో నిజంగానే డైరెక్టర్ అనుకోని ఆ నటి నమ్మేసింది. ఆ తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత అతను చాటింగ్ చేస్తూ తాము చేయబోయే సినిమాలో పాత ఇప్పిస్తానని ఆమెకు ఆశ చూపించాడు.

అలా చాటింగ్ చేస్తూ ఆమెకు అసభ్యకర మెసేజ్లు పంపడం మొదలుపెట్టాడు. దీంతో అది ఫేక్ అకౌంట్ నా లేకుంటే డైరెక్ట్ అకౌంట్ నా ఆమెకు సందేహం వచ్చింది. వెంటనే ఆ మెసేజ్ లు స్క్రీన్ షాట్ తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఇక అభిమానులు దాన్ని ఫేక్ అకౌంట్ అని తెలిసిన వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇలా ఫేక్ అకౌంట్ తో ఆడవారిని వేధించే దుర్మార్గులను శిక్షించాలి అంటోంది పాయల్. దర్శకుడు కూడా తన పేరుమీద ఫేక్ ఐడీలు క్రియేట్ చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపారు.